← Back to news

గ్లాసెస్ పెట్టుకుంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్!

By Sahani· 1d ago
గ్లాసెస్ పెట్టుకుంటే థియేటర్ ఎక్స్‌పీరియన్స్!

మెటా కనెక్ట్ 2026 ఈవెంట్‌లో ఆ కంపెనీ VR గ్లాసెస్‌ను లాంచ్ చేసింది. ఇవి సాధారణ హెడ్‌సెట్‌లా హెడ్‌బ్యాండ్ లేకుండా 100 గ్రాముల వెయిట్‌తో వస్తున్నాయి. ఇందులో 5K మైక్రో-OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమ్స్, 3D మూవీస్, లైవ్ స్పోర్ట్స్ నెక్స్ట్ లెవెల్‌లో చూడొచ్చు. ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి వర్చువల్ బిగ్ స్క్రీన్‌లా కూడా వాడొచ్చు. వీటితో పాటు కెమెరా లేకుండా కేవలం మ్యూజిక్, కాల్స్, AI కోసం రే-బాన్ మెటా ఆడియో గ్లాసెస్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

More in Technology