పెద్దలూ టీకా వేసుకోవాల్సిందే!

టీకాలు కేవలం చిన్నపిల్లలకే కాకుండా 18 ఏళ్లు దాటిన పెద్దలకు కూడా ఎంతో అవసరమని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. వయసు పెరిగే కొద్దీ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం, శీతాకాలంలో వైరస్ ఇన్ఫెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉండటంతో వ్యాక్సినేషన్ రక్షణ కవచంలా పనిచేస్తుందటున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారు, షుగర్, BP, ఆస్తమా ఉన్నవారు ఏటా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. అంతేకాకుండా హెపటైటిస్-బి, చికెన్‌పాక్స్, టిడాప్, యాంటీ రేబీస్ వంటి వ్యాక్సిన్లను హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ సలహాతో డోసులు తీసుకోవాలి.



