← Back to news

ఇంట్లోనే పనీర్.. 10 నిమిషాల్లో తయార్!

By Krishna· 14h ago
ఇంట్లోనే పనీర్.. 10 నిమిషాల్లో తయార్!

ఇంట్లో పనీర్ చేసుకోవడం చాలా ఈజీ. ఒక గిన్నెలో చిక్కటి పాలు పోసి వేడి చెయ్యండి. మరుగుతున్నప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసి మెల్లగా కలపండి. పాలు విరిగి, నీరు వేరవుతుంది. స్టవ్ ఆఫ్ చేయండి. విరిగిన పాలను పల్చటి కాటన్ క్లాత్‌లో వేసి వడకట్టండి. నిమ్మరసం పులుపు పోవడానికి నీటితో కడిగి, నీరంతా పోయేలా గట్టిగా పిండేయండి. ఆ వస్త్రాన్ని ఓ ప్లేట్‌లో పెట్టి, దానిపై బరువైన వస్తువును ఉంచండి. 2 గంటల తర్వాత తీసి చూస్తే పనీర్ గట్టిగా తయారవుతుంది. అంతే..!

More in Health