జనావాసాల్లోకి కొండచిలువ.. సురక్షితంగా రక్షణ!

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్‌లో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మేకల సతీష్ బాబు ఆధ్వర్యంలో ఎకో పార్క్ సిబ్బంది, హనుమాన్ టీమ్ సభ్యులు కలిసి కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దాన్ని అరణ్యరామం (బ్రహ్మానందపురం) అటవీ ప్రాంతానికి తరలించి సురక్షితంగా వదిలేశారు. జనావాసాల్లో పాములు కనిపిస్తే అటవీ శాఖకు, అలాగే 9966809162, 8341818594 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.



