← Back to news

దుగ్గిరాలలో 14 అడుగుల గణేష్ నిమజ్జనం

By BUJJIBABU· 19h ago· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల రథం సెంటర్‌లో 48 ఏళ్లుగా గణేష్ ఉత్సవ కమిటీ వినాయక మండపం ఏర్పాటు చేస్తోంది. బుధవారం 11వ రోజు 14 అడుగుల వినాయకుడి నిమజ్జనం వైభవంగా జరిగింది. పుష్పాలతో అలంకరించిన వాహనంపై స్వామివారిని ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, బ్యాండ్ మేళాల నడుమ శోభాయాత్ర రథం సెంటర్ నుంచి శివాలయం, పోలీస్ స్టేషన్, రైలుపేట, లవంగాలపేట, యాదవ బజార్, జండాచెట్టు మీదుగా సాగింది. మహిళలు, భక్తులు దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local