10K Steps అవసరం లేదు!

రోజూ 10,000 అడుగులు వేయాలి అనుకుంటున్నారా? అసలు అవసరం లేదు! మీరు ఇప్పటివరకు తక్కువగా నడుస్తుంటే, రోజులో కొన్ని అడుగులు అదనంగా వేయడం మొదలుపెట్టినా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నడక వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మూడ్ మెరుగవుతుంది, బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. క్రమంగా గుండెపోటు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వంటి సమస్యల ముప్పు కూడా తగ్గొచ్చు. 10K అనే నంబర్‌ను మర్చిపోండి… రోజూ కాస్త ఎక్కువగా కదలడం మొదలుపెట్టండి! 🚶♀️



