దుమారానికి దారి తీసిన విజయ్ నివాళులు !

నిషేధిత ఎల్ టీటీఈ ఫౌండర్ వేలు పిళ్లై ప్రభాకరన్ కు తమిళనాడు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ అంజలి ఘటించడం పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. ప్రభాకరన్ వర్ధంతి రోజున విజయ్ ఆతనికి నివాళులర్పించి ప్రవాస తమిళులకు అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. అయితే దీనిని బీజేపి తప్పుబట్టింది. తండ్రిని హతమార్చిన కిరాతకునికి సీఎం నివాళి ఇస్తుంటే రాహుల్ చూస్తూ ఊరుకున్నాడని ఎద్దేవా చేసింది. సీఎం చర్యను టీవీకే సమర్ధించుకుంది. అక్కడ లంకలో తమిళుల ఊచకోతలో చనిపోయిన బాధితులు కూడా ఉన్నారని వారికి అంజలి ఘటించామని వివరణ ఇచ్చింది.



