← Back to news

ST జాబితాలో పూసల కులం... డిమాండ్!

By MADDIMANENI mpkr· 19h ago· Anantapur Rural, Anantapur Urban, Ananthapuramu

ఆంధ్రప్రదేశ్‌లోని పూసల కులస్తులను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలనే డిమాండ్‌పై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఏపీ పూసల సంఘం జిల్లా అధ్యక్షులు పూసల హనుమంతు కోరారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. పూసల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. తరతరాలుగా సంచార జీవులుగా ఉంటూ గుడిసెల్లో గడుపుతున్న కుటుంబాలకు సొంత ఇళ్లు, విద్యా-ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

More in Local