ప్రత్యామ్నాయ పంటలతో సాగు మేలు: DAO

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాసంగి సాగు సమయంలో రైతులు నీటి పొదుపునకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. యశ్వంతరావు సూచించారు. ఎల్‌నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, ఆముదం పంటలను సాగు చేయాలని కోరారు. అధిక నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న పంటలకు దూరంగా ఉండాలని తెలిపారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకొని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.


