అల్పపీడనం.. భారీ వర్షాలు

నెల్లూరు, తిరుపతికి దగ్గర్లో.. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం అక్టోబర్ 19న ఏర్పడబోతోంది. దాని ప్రభావం ఇప్పటికే AP, తెలంగాణపై ఉంది. అలాగే బలమైన ద్రోణి కూడా దక్షిణ భారత్ అంతటా ఉంది. అందువల్ల ఇవాళ అక్టోబర్ 18న AP, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా పడతాయి. కొన్నిచోట్ల లైట్ రెయిన్ పడుతుంది. ముఖ్యంగా ఏపీ తీర ప్రాంతం మొత్తం భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని జూమ్ ఎర్త్ శాటిలైట్ డేటా తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 23 వరకూ అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుందని IMD చెప్పింది.



