← Back to news

బస్‌స్టేషన్‌లో కూలిన ఫాల్స్ సీలింగ్ 🚍

By BK· 3h ago· సిద్ధిపేట
బస్‌స్టేషన్‌లో కూలిన ఫాల్స్ సీలింగ్ 🚍

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ RTC బస్‌స్టేషన్‌లో ప్లాట్‌ఫాం ఫాల్స్ సీలింగ్ గురువారం రాత్రి హఠాత్తుగా కూలిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి సీలింగ్ తడిసిపోవడమే దీనికి కారణమని స్థానికులు తెలిపారు. వర్షం వల్ల ప్రయాణికులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్లాట్‌ఫాం విస్తరణ జరిగి కొన్ని నెలలే అవుతుంది. పక్కన ఉన్న మిగతా సీలింగ్ కూడా ఊడిపోయేలా ఉంది. అధికారులు రాకపోయినా, స్థానిక కార్మికులు ఆ శిథిలాలను తొలగించారు.

More in Local