← Back to news

డివైడర్‌ను ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

By dk· 17 Aug 2026· రంగారెడ్డి జిల్లా
డివైడర్‌ను ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి

TG: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగి PS పరిధిలోని కాళీ మందిర్ వద్ద బైక్‌పై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వికాస్ (23) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వికాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

More in Local