డేటా సెంటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

AP: డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ విశాఖపట్నం నగరంలో 'గ్రీన్ విశాఖ' ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పాప డెయిరీ ఫామ్ వద్ద ఉన్న హెచ్‌పి గ్యాస్ గోడౌన్ నుండి రవీంద్ర నగర్ లాస్ట్ బస్టాప్ వరకు ఈ ర్యాలీ సాగింది. రెండు వందల మంది ప్రజలతోపాటు Climate Action, Coaliation for AI Regulation సంస్థల సభ్యులు పాల్గొన్నారు. జోరు వానలోనూ ర్యాలీ కొనసాగింది. నల్ల బట్టలు వేసుకొని, దీన్ని 'బ్లాక్ డే ఫర్ వైజాగ్'గా పాటించారు.







