లోకల్ ఎలక్షన్స్‌పై YSRCP మరో పిటిషన్!

AP: లోకల్ ఎలక్షన్స్‌లో పోటీ చేసే క్యాండిడేట్స్‌పై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను 24 గంటల్లో అందించేలా ఆదేశాలు ఇవ్వాలని YSRCP హైకోర్టుకు వెళ్ళింది. MLC లేళ్ల అప్పిరెడ్డి ఈ పిటిషన్ వేశారు. అభ్యర్థులపై కేసుల వివరాలు తెలియక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మరోవైపు, కేసుల వివరాలు వెల్లడించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని SECకి లెటర్ రాశారు. తమ పార్టీ వారిపై కేసులు పెట్టి, వారిని భయపెట్టి ఎన్నికలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.



