← Back to news

గ్లోబల్ జీనియస్ స్కూల్‌ను సీజ్ చేయాలి

By Boggula Anumanna (Abhi)· 21 Aug 2026· Yemmiganur, Yemmiganur, Kurnool
గ్లోబల్ జీనియస్ స్కూల్‌ను సీజ్ చేయాలి

AP: ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్లోబల్ జీనియస్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీఆర్‌ఎస్‌వైఎఫ్ జిల్లా కన్వీనర్ రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది మాట్లాడారు. అనుమతులు, గుర్తింపు లేని పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

More in Local