← Back to news

AIపై మాజీ గూగుల్ రీసెర్చర్ హెచ్చరిక!

By Mahesh· 16 Sept 2026· X
AIపై మాజీ గూగుల్ రీసెర్చర్ హెచ్చరిక!

AI సేఫ్టీపై మరో కీలక హెచ్చరిక వెలువడింది. గూగుల్ డీప్‌మైండ్ AGI సేఫ్టీ టీమ్‌లో పనిచేసిన <a href="https://x.com/JoshAEngels/status/2098890712830169115">జోష్ ఎంగెల్స్</a> ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాబోయే ఐదేళ్లలో అడ్వాన్స్‌డ్ AI వల్ల మానవాళికి తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశముందని ఆయన హెచ్చరించారు. మనుషుల కంటే తెలివైన ఆర్టిఫిషియల్ సూపర్‌ ఇంటెలిజెన్స్ కోసం కంపెనీలు పోటీపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. AI డెవలప్‌మెంట్ వేగాన్ని తగ్గించి సేఫ్టీ రీసెర్చ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని సూచించారు. Anthropic, OpenAI ఆఫర్లను కాదని METRలో చేరినట్లు తెలిపారు.

More in Technology