← Back to news

భక్తులకు బిగ్ అలర్ట్.. సోమేశ్వర ఆలయానికి వెళ్లొద్దు

By DK· 7h ago
భక్తులకు బిగ్ అలర్ట్.. సోమేశ్వర ఆలయానికి వెళ్లొద్దు

నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దేవునిగుంపులోని ప్రసిద్ధ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వరద నీటితో చుట్టుముట్టింది. ఆలయానికి సుమారు కిలోమీటరు దూరం నుంచే వరద ప్రవాహిస్తుండడంతో భక్తులు ఆలయానికి వెళ్లకుండా దేవాదాయ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆలయానికి వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా స్వామివారికి సంబంధించిన విలువైన వస్తువులు, పూజా సామగ్రిని అర్చకులు భద్రపరిచారు.

More in Local