← Back to news

భారీ వర్షాల ఎఫెక్ట్.. KU పరీక్షలు వాయిదా

By MOHAMMED· 1d ago· Khila Warangal, Khila Warangal, Warangal
భారీ వర్షాల ఎఫెక్ట్.. KU పరీక్షలు వాయిదా

వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కేయూ పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి, తదుపరి పరీక్షల షెడ్యూల్ కోసం అధికారిక ప్రకటనను పరిశీలించాలని సూచించారు.

More in Local