శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు

AP: గుడివాడ పట్టణం నుండి విజయవాడ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల క్రితం కూలిపోయిన కల్వర్టు తమ పరిధి కాదని ఆర్అండ్‌బి, తమ పరిధిలో లేదంటూ మునిసిపాలిటీ..ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం పూర్తిగా ఆగిపోయింది. నిత్యం గుడివాడ విజయవాడ నాన్ స్టాప్ బస్సులు, పలు గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పల్లె వెలుగు బస్సులు పట్టణమంతా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.



