భక్తితో పాటు బాధ్యత ఉండాలి

వినాయక నిమజ్జనం తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో పర్యావరణంతో పాటు మున్సిపల్ కార్మికులపై అదనపు భారం పడుతోంది. హైదరాబాద్ నగరంలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన వినాయకుడి నిమజ్జన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. అయితే వేడుకల్లో ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వినియోగించడంతో నిమజ్జనం తర్వాత వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ కార్మికులు అదనపు శ్రమ చేయాల్సి వస్తోంది.



