← Back to news

విమాన ప్రమాదం.. 32 మంది దుర్మరణం

By Krishna· 11h ago
విమాన ప్రమాదం.. 32 మంది దుర్మరణం

నైజీరియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ATR-42 మిలిటరీ ప్లేన్ అక్టోబర్ 5న బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు రొటీన్ మిషన్‌లో వెళ్తూ ఒండో రాష్ట్రం ఇగ్బోకోడా, నేవల్ బేస్ దగ్గర కూలిపోయింది. ప్లేన్‌లో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉండగా.. అందరూ చనిపోయారని అధ్యక్షుడు బోలా టినుబు ప్రకటించారు. రాడార్‌తో విమాన సంబంధాలు తెగిన తర్వాత శిథిలాలు, మృతదేహాలూ కనిపించాయి. దర్యాప్తు మొదలైంది. ఇటీవలి సంవత్సరాల్లో నైజీరియాలో అత్యంత విషాదకర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటి.

More in International