దుబాయిలో బతుకమ్మ చందాల దందా!

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరుతో కొందరు తెలంగాణ ప్రవాసులు చందాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వివిధ సంఘాల ప్రతినిధులమంటూ ప్రముఖులను కలిసి వేడుకలకు ఆహ్వానిస్తూ ఆర్థిక సహాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఒక రాజకీయ వర్గం పేరుతో కార్యక్రమాలు నిర్వహించిన కొందరు ఈసారి మరో వర్గం పేరుతో ముందుకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. చందాలతో పాటు సంఘాల్లో పదవులు కోరుతూ ప్రముఖులను కలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోని రాజకీయ నాయకులను కలిసి దుబాయిలో జరిగే బతుకమ్మ వేడుకలకు రావాలని ఆహ్వానిస్తున్నారు.



