← Back to news

ఇడుపు కాయితం అర్థం పవన్‌కళ్యాణ్‌ బాగా చెప్తాడు

By DK· 28 Jun 2026· హైదరాబాద్‌
ఇడుపు కాయితం అర్థం పవన్‌కళ్యాణ్‌ బాగా చెప్తాడు

TG: తెలంగాణ రాకుండా అడ్డుకున్న అనకొండలు, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గుంటనక్కేలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గప్ చుప్ అయ్యాయన్నారు. ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారన్నారు.

More in Politics