← Back to news

పబ్లిక్ టాయిలెట్లు క్లీన్‌గా ఉండాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

By Nani Eluri· 2h ago· Aninews
పబ్లిక్ టాయిలెట్లు క్లీన్‌గా ఉండాల్సిందే:  ఢిల్లీ హైకోర్టు

పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉండటం కూడా మన జీవించే హక్కులో భాగమేనని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. టాయిలెట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి విద్యార్థులతో సడన్ చెకింగ్ చేయించాలని చెప్పింది. ఢిల్లీ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, అదితి మహావిద్యాలయ విద్యార్థులు టాయిలెట్ల ఫొటోలు తీసి రిపోర్ట్ ఇవ్వాలి. టాయిలెట్లను శుభ్రంగా ఉంచకపోతే బాధ్యులైన MCD అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని కోర్టు కోరింది. ఈ కేసుపై నవంబర్ 2న మళ్లీ విచారణ జరగనుంది.

More in National