100 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్..

తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో 137 కిలోల క్రిస్టల్ మెత్ డ్రగ్స్ను DRI అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ 100 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ను సముద్ర మార్గంలో శ్రీలంకకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితుల దగ్గర 10 లక్షల రూపాయల నగదుతో పాటు రెండు కార్లు, ఒక బైక్ను కూడా సీజ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటున్నారు.


