“రేపటి నుంచి స్టార్ట్ చేస్తా”.. ఈ రేపు ఎప్పుడొస్తుంది?

“రేపటి నుంచి స్టార్ట్ చేస్తా”.. ఈ మాట మనలో చాలామంది రోజూ అనుకుంటూనే ఉంటాం. జిమ్‌కి వెళ్లాలి, చదవాలి, కొత్త స్కిల్ నేర్చుకోవాలి, ఖర్చులు తగ్గించాలి.. ఏదైనా సరే, మొదలు పెట్టాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడున్న కష్టం కంటే.. తర్వాత చేస్తాననే ఆలోచన మనకు కాస్త రిలీఫ్ ఇస్తుంది. కానీ ఆ “రేపు” మళ్లీ మరో రేపుగా మారిపోతుంది. చివరికి పని కంటే.. దాన్ని మొదలుపెట్టడమే పెద్ద సమస్యగా మారుతుంది. రేపు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది.. కానీ మార్పు మాత్రం మనం మొదలు పెట్టినప్పుడే వస్తుంది.

