← Back to news

ఇలాంటి పిల్లలు ఉండాలి..

By sahani· 16 Jun 2026· X· Delhi

ఢిల్లీ మెట్రోలో జరిగిన ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెట్రో స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న ఒక సీఐఎస్‌ఎఫ్ (CISF) జవాన్‌ని చూసి.. ఒక చిన్న బాబు ఎంతో గర్వంగా సెల్యూట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ జవాన్ కాళ్లకు దండం పెట్టి రెస్పెక్ట్ ఇచ్చాడు. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసిన నెటిజన్లు. "బాబుకి పేరెంట్స్ చాలా మంచి పద్ధతులు నేర్పారు" అంటూ తెగ లైకులు, కామెంట్లు కొడుతున్నారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.