మొక్కలు DNAని దొంగిలిస్తాయా? 🧬

ఒక మొక్క మరో మొక్క దగ్గర నుంచి DNA తీసుకుని తనలో వాడుకుంటుందా? వినడానికి వింతగా ఉన్నా.. పరాన్నజీవి మొక్కల్లో ఇలాంటి విషయం నిజంగానే కనిపిస్తోంది. ఇవి మరో మొక్కకు అతుక్కుని నీరు, పోషకాలు తీసుకునే సమయంలో.. కొన్ని జీన్స్ కూడా తమలోకి తీసుకుంటున్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఆశ్చర్యమేంటంటే, ఆ జీన్స్‌లో కొన్ని మొక్కలో అలాగే ఉండిపోవడమే కాదు, అక్కడ పనిచేస్తున్నట్టు కూడా ఎవిడెన్స్ కనిపించింది. అంటే మొక్కలు కేవలం నీరు, పోషకాలనే కాదు.. ఒకదానికొకటి DNA కూడా పంచుకునే అవకాశం ఉందన్నమాట.



