కమిటీల ఎంపికపై కసరత్తు.. మాజీ ఎమ్మెల్యే రాజా సమీక్ష!

తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో వైఎస్సార్సీపీ అనుబంధ కమిటీల నియామకంపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా కసరత్తు చేపట్టారు. సీతానగరంలో ముఖ్య నాయకులతో కమిటీల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమై, గ్రామాల వారీగా సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామని, రాజా హామీ ఇచ్చారు.



