← Back to news

నీట మునిగిన స్మశాన వాటిక

By Y Nanibabu· 23h ago

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో ఎస్సీ కాలనీకి సమీపంలో ఉన్న దళితుల స్మశాన వాటిక భారీ వర్షాలకు నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుద్దగడ్డ కాలువ ద్వారా వరద నీరు స్మశాన వాటికలోకి చేరింది. దీంతో మొత్తం ప్రాంగణం నీటితో నిండిపోయి చెరువును తలపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలు నిర్వహించడం ఎలా అని స్థానిక దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

More in Local