యంగ్ డాక్టర్ల కోసం సచిన్ స్పెషల్ ఫెలోషిప్

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ టీచర్స్ డే సందర్భంగా ఓ మంచి ఇనిషియేటివ్‌ను స్టార్ట్ చేశారు. తన తండ్రి ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ మెమరీగా ‘ప్రొఫెసర్ రమేశ్ టెండూల్కర్ మెమోరియల్ ఫెలోషిప్’ను అనౌన్స్ చేశారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ (STF) ద్వారా ఈ ఫెలోషిప్ ప్రొవైడ్ చేయనున్నారు. శ్రీనగర్‌లో క్లఫ్ట్, క్రానియోఫేషియల్ సర్జరీలో స్పెషల్ ట్రైనింగ్ పొందే యంగ్ డాక్టర్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఏటా ఒక MD డాక్టర్‌కు ఏడాది ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కోర్సు పూర్తయ్యాక సర్టిఫికేట్ అందిస్తారు.



