విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్ట్ పంపిణీ

ములుగు జిల్లా వెంకటాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, టై, బెల్ట్ పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ నాయుడు వెంకటకృష్ణ, గ్రామ పెద్దలు శేషగిరి, అంజయ్యల చేతుల మీదుగా విద్యార్థులకు వీటిని అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి మంచి స్థాయికి చేరుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామారావు, వెంకటేశ్వరరావు, J. వెంకటేశ్వర్లు, I. భరత్, తదితరులు పాల్గొన్నారు.





