← Back to news

అనాథకు హెయిర్ కట్, షేవింగ్ చేసిన మంచు మనోజ్!

By sahani· 26 May 2026· X· Rangareddy district

రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ విజిట్ చేశారు. “సెలబ్రిటీ రీబర్త్ ఛాలెంజ్” లో భాగంగా ఆయన ఒక అనాథకు న్యూ లైఫ్ ఇచ్చారు. మలక్‌పేట్ రోడ్డుపై తిరుగుతున్న ఒక మెంటల్లీ అన్‌స్టేబుల్ పర్సన్‌ను ఆశ్రమం వాళ్లు చేరదీశారు. మనోజ్ స్వయంగా అతనికి హెయిర్ కట్, షేవింగ్ చేయించి, కొత్త బట్టలు ఇచ్చి నార్మల్ పర్సన్‌లా మార్చారు. ఈ ఆశ్రమానికి ఎప్పుడూ తన సపోర్ట్ ఉంటుందని మనోజ్ మాట ఇచ్చారు.

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.