← Back to news

పూలే దంపతులే ఆదర్శం: యాట్ల నాగేశ్వరరావు

By బొమ్ము దుర్గారావు· 15h ago· Velampalem, Ramachandrapuram, Dr. B.R. Ambedkar Konaseema
పూలే దంపతులే ఆదర్శం: యాట్ల నాగేశ్వరరావు

కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామలో సత్యశోధక్ సమాజ్ స్థాపన దినోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గ ఎంబీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1873 సెప్టెంబర్ 24న పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్‌కు నేటికి 153 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

More in Local