← Back to news

బస్టాండ్ పైకప్పు ఊడిపడి.. ప్రమాదం తప్పింది!

By Bejjanki· 15h ago· Bejjanki, Bejjanki, Siddipet

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం తప్పింది. సిద్దిపేట, సికింద్రాబాద్ 7వ నంబర్ ప్లాట్‌ఫారమ్ వద్ద సాయంత్రం పైకప్పు ఊడిపోయి కిందపడింది. ప్రయాణికుల రద్దీ లేని సమయంలో ఇది జరగడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఎవరైనా ఉంటే బలమైన గాయాలు తగిలేవి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు తడిచి ఊడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. బస్టాండ్‌లో మరికొన్ని చోట్ల పైకప్పు ఊడిపడే స్థితిలో ఉండడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

More in Local