SIRపై హైదరాబాద్‌లో హీట్.. రోడ్డెక్కిన కాంగ్రెస్
TG: SIRపై వ్యతిరేకత తెలంగాణలోనూ కనిపిస్తోంది. CEC జ్ఞానేష్ కుమార్ తన అధికారాన్ని తప్పుగా వాడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో భారీ ప్రొటెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి EC ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. SIRను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి, CECకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓటర్ల హక్కులను కాపాడాలనీ, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు.



