మన్మోహన్ సింగ్ విగ్రహం ఆవిష్కరించిన CM రేవంత్‌రెడ్డి

TG: హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో జంక్షన్ వద్ద మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌ను CM రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాజీ CJI జస్టిస్ ఎన్‌వీ రమణతో పాటు మంత్రులు హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు.


