← Back to news

మంగళగిరి–తాడేపల్లి: భారీ వర్షాల అలర్ట్

By BUJJIBABU· 20h ago· Guntur
మంగళగిరి–తాడేపల్లి: భారీ వర్షాల అలర్ట్

భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలని మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీమ్ బాషా ఆదేశించారు. టిడ్కో, NRI జంక్షన్, రత్నాల చెరువు, నులకపేట ప్రాంతాల్లో పర్యటించి డ్రైనేజీలను చెక్ చేశారు. నీరు నిలిచిపోకుండా పూడిక, చెత్తను వెంటనే క్లీన్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పాత భవనాలు, కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సేఫ్ ప్లేస్‌లకు షిఫ్ట్ అవ్వాలని కోరారు.

More in Local