← Back to news

దరఖాస్తు గడువు పొడిగింపు

By Krishna· 2h ago· Eenadu
దరఖాస్తు గడువు పొడిగింపు

TG: స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) 7,437 పోస్టుల భర్తీకి జులై 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోలీస్‌ కానిస్టేబుల్‌ సివిల్‌, ఏఆర్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌ ఫైటర్‌, జైలు వార్డర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు గడువు సెప్టెంబర్‌ 9 ఉండగా, ప్రభుత్వం సెప్టెంబర్‌ 16 సాయంత్రం 5 వరకు పెంచింది. ఇప్పటివరకూ 3,38,336 మంది రిజిస్టర్ అయ్యారు. 2,88,530 మంది ఫీజు చెల్లించి అప్లై చేశారు. ఆధార్ వెరిఫికేషన్‌ 95% పైగా పూర్తయింది. త్వరగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

More in TG