నర్సుల మానిటరింగ్‌తో హార్ట్ పేషెంట్లకు రక్షణ!

హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్లకు నర్సుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్ అందిస్తే మరణాల ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేరళలోని SCTIMST ఆధ్వర్యంలో 22 ఆసుపత్రుల్లో 1,507 మంది పేషెంట్లపై రెండేళ్లపాటు రీసెర్చ్ చేశారు. మొబైల్ యాప్‌తో నర్సులు వారి హెల్త్‌ను మానిటర్ చేస్తూ, మెడిసిన్స్, డైట్, లైఫ్‌స్టైల్‌పై సలహాలు ఇచ్చారు. దీంతో మరణాల ముప్పు 22% తగ్గగా, హాస్పిటల్స్‌లో చేరాల్సిన అవసరం కూడా తగ్గినట్లు రీసెర్చర్లు గుర్తించారు.



