← Back to news

కోడ్ ఉల్లంఘిస్తూ ఎంపీ అవినాష్ పెద్ద కాన్వాయ్‌తో రావడమేంటి?

By Ram krishna· 1h ago· Y.S.R. Kadapa
కోడ్ ఉల్లంఘిస్తూ ఎంపీ అవినాష్ పెద్ద కాన్వాయ్‌తో రావడమేంటి?

మూడుసార్లు కడప ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డికి ఎలక్షన్ రూల్స్ తెలియవా అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. పులివెందుల టీడీపీ ఆఫీస్‌లో మాట్లాడిన ఆయన, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల కోసం అవినాష్ పెద్ద కాన్వాయ్‌తో రావడంపై మండిపడ్డారు. 'మాదే అధికారం.. మాదే పెత్తనం' అనే రోజులు పోయాయని గుర్తుచేశారు. వైసీపీ టైమ్‌లో ప్రతిపక్షాల కాండిడేట్లను నామినేషన్లు కూడా వేయనివ్వని సంగతి ఎంపీ మర్చిపోయారా అని ఆదినారాయణ రెడ్డి నిలదీశారు.

More in Local