రాత్రిపూట కాళ్లనొప్పులు ఎందుకు?

కొందరికి రాత్రిపూట విపరీతంగా కాళ్ల నొప్పులు వస్తుంటాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండదు. ఇందుకు కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం, నరాల సమస్యలు, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం అంటున్నారు వైద్యులు. శరీరంలో తగినంత నీరు లేకపోతే కండరాలు బిగుసుకుపోయి రాత్రి సమయంలో నొప్పులు వస్తాయంటున్నారు. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాల లోపం వల్ల కూడా కండరాల పనితీరు దెబ్బతింటుందంటున్నారు. సమతుల్య ఆహారంతోపాటు తగినంత నీరు తాగడం అవసరమంటున్నారు.



