అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 75 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు రిజర్వాయర్‌లో 1.591 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 389.35 మీటర్లుగా నమోదైంది. క్యాచ్‌మెంట్ నుంచి 75 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రధాన కాలువ, స్పిల్‌వే ద్వారా నీటి విడుదల లేదు. ఆవిరి, ఇతర అవసరాలకు 6 క్యూసెక్కులు నమోదయ్యాయి.



