← Back to news

క్యాబ్‌ ఎక్కిన మహిళకు షాక్

By Sharmila· 4h ago
క్యాబ్‌ ఎక్కిన మహిళకు షాక్

TG: హైదరాబాద్‌.. శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. గచ్చిబౌలికి చెందిన 35 ఏళ్ల మహిళ.. పర్సనల్ పనిమీద 60 వేల రూపాయలతో క్యాబ్‌లో శంషాబాద్ వైపు వెళ్తుండగా, తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర డ్రైవర్ రూట్ మార్చి సర్వీస్ రోడ్డులోకి తీసుకెళ్లాడు. తర్వాత కొత్వాల్‌గూడ దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి, దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘటనపై RGIA పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

More in TG