మంచిర్యాలలో కాంగ్రెస్ నేతల సమావేశం

TG: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని మైనారిటీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎం.డి. నజీర్ హుస్సేన్ తెలిపారు. మంచిర్యాలలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్ మోహన్‌రావును నజీర్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీను బలోపేతం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని నజీర్ హుస్సేన్ తెలిపారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



