కోల్డ్ స్టోరేజ్‌లు లేక.. పంటలకు నష్టం

మన దేశంలో రైతులు పండించిన పంటలలో కొంత భాగం మార్కెట్‌కి చేరేలోపే పాడైపోతోంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టడీస్ ప్రకారం కోత తర్వాత.. ధాన్యాల్లో 4 నుంచి 6% , పండ్లలో 6 నుంచి 15%, కూరగాయల్లో 5 నుంచి 12 శాతం వరకు నష్టం జరుగుతోంది. సరైన కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడం దీనికి కారణం. దీంతో రైతులకు నష్టం రావడంతో పాటు ఆహారం కూడా వెస్ట్ అవుతోంది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు కోల్డ్ చైన్, స్టోరేజ్ సౌకర్యాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.


