← Back to news

పత్తి రైతులకు గుడ్‌న్యూస్‌.. 131 కొనుగోలు కేంద్రాలు

By Prashanth· 29 Sept 2026· Telangana
పత్తి రైతులకు గుడ్‌న్యూస్‌.. 131 కొనుగోలు కేంద్రాలు

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల సీజన్‌ ప్రారంభమైంది. నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో పత్తి మార్కెట్‌కు వస్తోంది. అక్టోబర్‌ రెండో వారం నుంచి CCI కొనుగోళ్లు ప్రారంభించనుంది. ఇందుకోసం కొనుగోలు కేంద్రాలను 122 నుంచి 131కి పెంచుతున్నారు.ఈసారి 48.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మీడియం స్టాపుల్‌కు రూ.8,267, పొడవు పింజకు 8,666 రూపాయల ధర ఉంది. రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More in Agriculture