AIతో కెరీర్‌లో అద్భుత అవకాశాలు

AP: కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తును శాసించే సాంకేతికతగా మారుతోందని, దానిపై పట్టు సాధించిన విద్యార్థులకే ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలు లభిస్తాయని అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణుడు డాక్టర్ కడిలి శ్యామ్ బెనగల్ అన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో "కృత్రిమ మేధస్సు – నేటి యుగం" అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. AI సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో అద్భుత విజయాలు సాధించవచ్చని తెలిపారు.



