← Back to news

DRDO సరికొత్త రికార్డ్: ‘ULPGM V3’ క్షిపణి ప్రయోగం సక్సెస్!

By aravinda nyayapati· 20 May 2026· Hyderabad
DRDO సరికొత్త రికార్డ్: ‘ULPGM V3’ క్షిపణి ప్రయోగం సక్సెస్!

భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ULPGM V3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. శత్రువుల బంకర్లు, ఆర్మీ ట్యాంకులు మరియు కదులుతున్న వాహనాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత.డ్రోన్లు లేదా మానవరహిత విమానాల (UAVs) నుండి ప్రయోగించేలా ఈ అత్యాధునిక వెపన్‌ను డిజైన్ చేశారు. ఈ విజయంతో రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' వైపు దేశం మరో పెద్ద అడుగు వేసినట్లయింది!

More in India