MGU ఎంఈడీ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఈడీ సెమిస్టర్–2 రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షల తేదీలను ముందుగానే పరిశీలించి, అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని సూచించారు. పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను MGU అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.



